భారత్ సమాచార్.నెట్, తూర్పుగోదావరి జిల్లా: భవాని దీక్షలో ఉన్న భక్తులపై వేగంగా దూసుకొచ్చిన కారు రూపంలో మృత్యువు కబళించింది. నల్లజర్ల మండలం పుల్లలపాడు గ్రామం వద్ద హైవేపై పాదయాత్రగా విజయవాడ వెళ్తున్న భవాని భక్తులపై అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో నక్కపల్లి మండలం దాసలపాడు గ్రామానికి చెందిన పాకృతి శివ (35), పాకృతి రాము (22) అనే ఇద్దరు భవాని భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను వెంటనే …





