భారత్ సమాచార్.నెట్, పార్వతీపురం మన్యం జిల్లా: రసాయనాలు లేని వ్యవసాయానికి, సంప్రదాయ చిరుధాన్యాల ప్రాశస్త్యానికి దక్కిన గౌరవమిది. పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం, వంజరపుగూడ గ్రామానికి చెందిన ఎస్టీ (గదబ) పీవీటీజీ మహిళ మర్రి నవ్యకు ‘ఏరువాక ఫౌండేషన్ ఎక్సలెన్స్ అవార్డు 2025’ లభించింది. గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీలో జరిగిన కిసాన్ మహోత్సవం సందర్భంగా, రసాయనాల్లేకుండా సేంద్రీయ పద్ధతిలో పండించిన చిరుధాన్యాలతో ఆమె తయారు చేస్తున్న రుచికరమైన ఉత్పత్తులకు గాను ఈ ఉత్తమ అవార్డును ప్రదానం చేశారు. ఏరువాక ఫౌండేషన్ ప్రతినిధులు ఆమెను దుశ్శాలువాతో సత్కరించి, మెమొంటోను బహుకరించారు.
సేంద్రీయ వ్యవసాయానికి ఆదర్శంగా నిలుస్తున్న నవ్యను గ్రామస్థులు, బంధువులు, గిరిజనులు అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రకృతికి దగ్గరగా ఉంటూ, ఆహార భద్రతకు దోహదపడుతున్న నవ్య విజయం ఎందరికో స్ఫూర్తిదాయకం.
మరిన్ని కథనాలు :
619 మంది కెడెట్లతో NCC శిక్షణ శిబిరం ప్రారంభం