భారత్ సమాచార్.నెట్, ప్రకాశం జిల్లా : గిద్దలూరు పట్టణం కొమరోలు బస్టాండ్ రోడ్డు నిరంతర ట్రాఫిక్ అంతరాయంతో సతమతమవుతోంది. ప్రతి గంటా ఇదే పరిస్థితి పునరావృతం కావడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కీలకమైన రోడ్డును పట్టించుకునే వారు లేకపోవడంతో, వాహనదారులు యథేచ్ఛగా పార్కింగ్ స్థలంగా వాడుకుంటున్నారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలపడం వల్ల రోడ్డు సన్నబడి, రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో అత్యవసర పనులపై వెళ్లే వారు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో నిలిచిపోవాల్సి వస్తోంది.
“అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ రోడ్డును అందరూ పార్కింగ్‌గా మార్చేశారు,” అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి, రోడ్డుపై పార్కింగ్‌కు శాశ్వతంగా చెక్ పెట్టి, ట్రాఫిక్ సమస్యకు ముగింపు పలకాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
మరిన్ని కథనాలు :
పథకాల అమలులో పారదర్శకతకు అడ్డంకులు