భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, అక్టోబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

పోలీస్ కమీషనరేట్ సాయుధ దళ కార్యాలయంలో ఆయుధపూజ

9

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా:  పోలీస్ కమీషనరేట్ పెద్దకోడూర్ గ్రామ శివారులో గల సాయుధ దళాల కార్యాలయంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, దుర్గదేవి అమ్మవారి నవరాత్రులులో భాగంగా ఆయుధాలకు, ప్రభుత్వ వాహనాలకు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. జమ్మి చెట్టుకు పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసే ప్రతి పనిలో అధికారులు సిబ్బంది విజయం సాధించాలని ఆకాంక్షించారు. దుర్గమాత కరుణాకటాక్షాలు పోలీసులకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించడం జరిగింది, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకోవడం అలనాటి నుంచి వస్తున్న సంప్రదాయం సమాజంలో చెడును పారదోలెందుకు పోలీస్ విభాగం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఏఆర్ పోలీస్ అధికారులకు మరియు సిబ్బంది, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ సిఐ లు పూర్ణచందర్, ధరణి కుమార్, విష్ణు ప్రసాద్, కార్తీక్, ఆర్ఎస్ఐ లు సాయిచరణ్, సాయి ప్రసాద్, నిరంజన్, అభిలాష్, పుష్ప, ఏఆర్ అధికారులు సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.