భారత్ సమాచార్.నెట్, సిద్దిపేట జిల్లా : విజయదశమి పండుగ సందర్భంగా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం వద్ద జరిగిన శమీ పూజ, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల గ్రూప్-1 ఉద్యోగాలు సాధించిన ముగ్గురు అభ్యర్థులను ఆయన సత్కరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా జరుపుకుంటామని, హుస్నాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేస్తూ.. బీసీ రిజర్వేషన్ల పెంపు ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో విధించిన 50% పరిమితిని తొలగిస్తూ తాము చేసిన చట్టాన్ని గవర్నర్ ఆమోదించాల్సి ఉందన్నారు. శాసనసభలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన అన్ని పార్టీలు, కోర్టులో కూడా రిజర్వేషన్లకు అనుకూలంగా అఫిడవిట్లు సమర్పించాలని మంత్రి డిమాండ్ చేశారు.
మరిన్ని కథనాలు :
ఎన్నికల కోడ్‌పై పకడ్బందీ నిఘా: సిద్దిపేట కలెక్టర్