భారత్ సమాచార్.నెట్, సిద్దిపేట జిల్లా : విజయదశమి పండుగ సందర్భంగా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం వద్ద జరిగిన శమీ పూజ, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల గ్రూప్-1 ఉద్యోగాలు సాధించిన ముగ్గురు అభ్యర్థులను ఆయన సత్కరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా జరుపుకుంటామని, హుస్నాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేస్తూ.. బీసీ రిజర్వేషన్ల పెంపు ఎవరికీ…





