భారత్ సమాచార్.నెట్, గుంటూరు జిల్లా : తెనాలి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. బంతితో ఆడుకుంటూ బయటకు వెళ్లిన ఐదేళ్ల బాలుడు పశ్చిమ పంట కాలువలో పడి మరణించాడు. బాలాజీరావుపేటకు చెందిన నసీమా కుమారుడు ఆషిక్ రెహెమాన్ (5) గంట సేపయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు గాలించడం మొదలుపెట్టారు. వెతుకులాటలో బాలుడి బంతి పశ్చిమ పంట కాలువలో కనిపించడంతో, ఆషిక్ కాలువలో మునిగిపోయి ఉంటాడని అనుమానించారు.
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, గజ ఈతగాళ్ల సహాయంతో వెతికించారు. అయితే ఆ రోజు బాలుడి ఆచూకీ లభించలేదు. గురువారం నాడు అదే కాలువలో ఆషిక్ మృతదేహం కనిపించింది.కొడుకు మరణ వార్తతో తల్లి నసీమా, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.
మరిన్ని కథనాలు :
గొప్ప మనసు చాటుకున్న కేంద్ర మంత్రి