భారత్ సమాచార్.నెట్, గుంటూరు జిల్లా : తెనాలి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. బంతితో ఆడుకుంటూ బయటకు వెళ్లిన ఐదేళ్ల బాలుడు పశ్చిమ పంట కాలువలో పడి మరణించాడు. బాలాజీరావుపేటకు చెందిన నసీమా కుమారుడు ఆషిక్ రెహెమాన్ (5) గంట సేపయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు గాలించడం మొదలుపెట్టారు. వెతుకులాటలో బాలుడి బంతి పశ్చిమ పంట కాలువలో కనిపించడంతో, ఆషిక్ కాలువలో మునిగిపోయి ఉంటాడని అనుమానించారు.
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, గజ ఈతగాళ్ల సహాయంతో వెతికించారు. అయితే ఆ…





