భారత్ సమాచార్.నెట్, ప్రకాశం జిల్లా : దట్టమైన అడవులతో కూడిన ప్రకాశం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను, ముఖ్యంగా రైతులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. జిల్లాలోని దోర్నాల మండలం బొమ్మలాపురం గండి చెరువు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి తిరుగుతూ హల్‌చల్ చేయడంతో కలకలం రేగింది. పొలాల వైపు వెళ్తున్న కొందరు రైతులకు ఈ పెద్దపులి కంటపడింది. వెంటనే అప్రమత్తమైన రైతులు ఆ సంచారాన్ని తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఆ వీడియో ప్రస్తుతం వాట్సాప్ గ్రూపులలో వైరల్ అవుతోంది.
గండి చెరువు సమీప ప్రాంతాల్లోని రైతులు, రైతు కూలీలు ఈ ఘటనతో భయంతో వణికిపోతున్నారు. దీనిపై అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. గండి చెరువు సమీప గ్రామస్తులు, రైతులకు హెచ్చరికలు జారీ చేస్తూ, అప్రమత్తంగా ఉండాలని మరియు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు.
మరిన్ని కథనాలు :
బొమ్మనబోయిన వెంకటేశ్వర్లుకు టీడీపీ శ్రేణుల సన్మానం