భారత్ స‌మాచార్.నెట్, ప్రకాశం జిల్లా : దట్టమైన అడవులతో కూడిన ప్రకాశం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను, ముఖ్యంగా రైతులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. జిల్లాలోని దోర్నాల మండలం బొమ్మలాపురం గండి చెరువు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి తిరుగుతూ హల్‌చల్ చేయడంతో కలకలం రేగింది. పొలాల వైపు వెళ్తున్న కొందరు రైతులకు ఈ పెద్దపులి కంటపడింది. వెంటనే అప్రమత్తమైన రైతులు ఆ సంచారాన్ని తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఆ వీడియో ప్రస్తుతం వాట్సాప్ గ్రూపులలో వైరల్ అవుతోంది.

 

గండి చెరువు సమీప…