భారత్ సమాచార్.నెట్, నిర్మల్ జిల్లా : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడి ప్రయత్నాన్ని నిర్మల్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ (BSP) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ మంగళవారం మాట్లాడుతూ.. మతోన్మాద అడ్వకేట్ రాకేష్ కిషోర్ షూ విసిరి దాడికి యత్నించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ సంఘటన భారత న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని ఆయన పేర్కొన్నారు. తక్షణమే నిందితుడైన మతోన్మాద లాయర్‌ను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని జగన్మోహన్ డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బహుజన సామాజిక వర్గాలు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పటికీ, ఇలాంటి దాడులు జరగడం విచారకరమని, అందుకే అంబేద్కర్ సూచించిన విధంగా బహుజనులు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారాలని ఆయన గుర్తు చేశారు. ఈ ఖండన కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు జోసెఫ్, గంగారాం, లక్ష్మీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు :
ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు