భారత్ సమాచార్.నెట్, ములుగు జిల్లా: గిరిజనుల హక్కుల కోసం “జల్, జంగల్, జమీన్” (నీరు, అడవి, భూమి) నినాదంతో పోరాడి అమరుడైన కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా ములుగు జిల్లాలో ఆయనకు ఘన నివాళులర్పించారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు కన్నాయిగూడెం మండలంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగా కళ్యాణి ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిపుత్రుల చైతన్యానికి ప్రతిరూపమైన కొమరం భీమ్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రేగా కళ్యాణి మాట్లాడుతూ… భీమ్ గోండ్ తెగలకు చెందిన విప్లవ నాయకుడని, 1930లలో నిజాం భూస్వాములకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటానికి నాయకత్వం వహించారని కొనియాడారు. ఆయన సృష్టించిన నినాదం నేటికీ ఆదివాసీ ఉద్యమాలకు మార్గదర్శకంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ ఆయన పోరాటం ఒక ప్రత్యేక భాగమని ఆమె గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆదివాసి సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు :
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: రేగా కళ్యాణి