భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: జిల్లా కేంద్రంలోని 20వ వార్డులో బాకీ కార్డు అనే నినాదంతో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల పేరుతో 420 హామీలు ఇచ్చి హద్దు పద్దులేని హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ప్రశ్నిస్తున్నారని, 22 నెలల పాలనలో మహిళలకు రూ. 2500 హామీ కింద ఒక్కొక్కరికి రూ. 55 వేలు, వృద్ధులకు పెన్షన్ నెలకు రూ. 4 వేల హామీ కింద ఒక్కొక్కరికి రూ.44 వేలు, వికలాంగులకు పెన్షన్ రూ. 6 వేల హామీ కింద ఒక్కొక్కరికి రూ. 44 వేలు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడినట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుందని అన్నారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీ కూడా బాకీగా మిగిలి ఉన్నాయన్నారు. విద్యా భరోసా కార్డ్ కింద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని, ప్రజలు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
మరిన్ని కథనాలు:
వనపర్తిలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం