భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: భారత సుప్రీంకోర్టు సిజెఐ జస్టిస్ గవాయి పై దాడికి ప్రయత్నించిన రాకేష్ లాయర్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి భద్రాద్రి కొత్తగూడెం మాలమహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పౌల్ రాజ్ డిమాండ్ చేసారు. భారత ప్రధాన న్యాయమూర్తి పై దాడి చేయడానికి ప్రయత్నం చేయడాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ దాడి పూర్తిగా అప్రజా స్వామీకం, అవివేకం, ఇటువంటి దుశ్చర్యకు పాల్పడి తనకు ఏమి కాదని అహంభావంతో దాడికి పాల్పడ్డారని అన్నారు. తెలవక చేసిన తప్పును క్షమించవచ్చు కానీ తెలిసి కావాలని న్యాయవ్యవస్థలో ఉన్నటువంటి సులభ చట్టాలను అలుసుగా తీసుకొని కావాలని ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని మండిపడ్డారు. ఈ విషయం భారత దేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం అని, సనాతనవాదులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోవాలని లేనిపక్షంలో అంబేద్కర్ వాదులు అందరూ తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
మరిన్ని కథనాలు:
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగాపై నిప్పులు చెరిగిన తాటి