భారత్ సమాచార్.నెట్, నిర్మల్: స్థానిక సంస్థల ఎన్నికలలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం మీడియా మానిటరింగ్ సర్టిఫికేషన్ కమిటీ (ఎంసీఎంసీ) కేంద్రాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని సమాచార శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి వార్తపై నిఘా ఉంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే ప్రచారాలను, తప్పుడు సమాచారాన్ని వెంటనే నమోదు చేయాలన్నారు. వాస్తవాధారిత వార్తలతో ప్రజల్లో విశ్వాసం పెంపొందించడంలో మీడియా పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, డీపీఆర్వో సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు
చెరువులో దూకి అన్నదమ్ములు ఆత్మహత్య