భారత్ సమాచార్.నెట్, నిర్మల్: స్థానిక సంస్థల ఎన్నికలలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ బుధవారం మీడియా మానిటరింగ్‌ సర్టిఫికేషన్‌ కమిటీ (ఎంసీఎంసీ) కేంద్రాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని సమాచార శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌లో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి వార్తపై నిఘా ఉంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే ప్రచారాలను, తప్పుడు సమాచారాన్ని వెంటనే నమోదు చేయాలన్నారు. వాస్తవాధారిత వార్తలతో ప్రజల్లో విశ్వాసం పెంపొందించడంలో మీడియా పాత్ర కీలకమని…