భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, అక్టోబర్ 2025, గురువారంభారత్ సమాచార్

దొంగతనాలకు పాల్పడుతున్న దంపతులు అరెస్ట్

22

భారత్ సమాచార్, గుంటూరు జిల్లా: సొంత ఊరిలోనే  తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేసారు. కొల్లిపరకు చెందిన భార్యాభర్తలు కటారి వెంకటేశ్వర్లు (27), తేజ నాగమణి గత కొంతకాలంగా దొంగతనాలు చేస్తున్నారు. పల్సర్ బండిపై తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. తూములూరు గ్రామంలో మధుసూదన్ రావు ఇంటికి ఉన్న తాళం పగలగొట్టి బంగారం, వెండి, నగదు చోరీ చేసారు. దీంతో  కొల్లిపర పోలీసులకు బాధితుడు పిర్యాదు చేసాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కటారి వెంకటేశ్వర్లు, తేజ నాగమణిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. దొంగతనం చేసినట్లు నిర్ధారణ కావడంతో నిందితుడు వద్ద నుండి 173 గ్రాముల బంగారం, 226 గ్రాముల వెండి, 2,15000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఇప్పటికే  వారిపై 13 కేసులు నమోదయ్యాయని,  నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

మరిన్ని కథనాలు: 

తెనాలిలో విషాదం: కాలువలో పడి ఐదేళ్ల బాలుడి మృతి