భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, అక్టోబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

మహిళల రక్షణే ప్రధాన లక్ష్యం: ఎస్పీ

WhatsApp Image 2025-10-09 at 6.47.15 PM

భారత్ సమాచార్.నెట్, జోగులాంబ గద్వాల: జిల్లాలో మహిళల, బాలికల రక్షణ కోసం పోలీస్ షీ టీమ్ ప్రత్యేక దృష్టి పెట్టి, ఆకతాయిలకు చెక్ పెడుతుందని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్ తెలిపారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా నిర్భయంగా షీ టీమ్ నంబర్ 8712670312 కు కాల్ చేసి సహాయం పొందాలని సూచించారు.

వేధించే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, రద్దీ ప్రదేశాలు, విద్యా సంస్థల వద్ద షీ టీమ్ నిఘా పెట్టిందన్నారు. గడిచిన సెప్టెంబర్ నెల పనితీరును వెల్లడిస్తూ.. షీ టీమ్ బృందం 13 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 93 హాట్‌స్పాట్‌ల తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో ఐదుగురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని, 7 ఈ-పెట్టి కేసులు నమోదు చేసింది. షీ టీమ్ అవగాహన కార్యక్రమాలలో చైల్డ్ మ్యారేజ్, సైబర్ నేరాలు, సెల్ఫ్ డిఫెన్స్ వంటి చట్టాలపై యువతకు చైతన్యం కల్పించింది.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

ఇందిరమ్మ ఇండ్లు, ఐటీసీని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్