భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, అక్టోబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

ఘ‌నంగా కాన్షీరాం 19వ వర్ధంతి వేడుకలు

WhatsApp Image 2025-10-09 at 9.08.57 PM

భారత్ స‌మాచార్.నెట్, నిర్మ‌ల్ జిల్లా : “కులంతోనే కులాంతం” అనే నినాదంతో బహుజనుల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పోరాటయోధుడు, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకుడు మాన్యశ్రీ కాన్షీరాం 19వ వర్ధంతి వేడుకలను నిర్మల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. నిర్మల్ పట్టణంలో బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జగన్ మోహన్ నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు సెమినార్ నిర్వహించి, కాన్షీరాం చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జగన్ మోహన్ మాట్లాడుతూ.. భారత రాజకీయ చరిత్రలోనే కాన్షీరాం ఒక అత్యున్నత రాజకీయ వ్యూహకర్త అని కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ సిద్ధాంతాన్ని కేవలం సిద్ధాంతంగా కాకుండా, తన వినూత్న పని విధానంతో ఆచరణలోకి తెచ్చిన గొప్ప వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు. బహేన్ కుమారి మాయావతి నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా నాయకులు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జోసఫ్ గంగారాం, లక్ష్మి యాదవ్, డాక్టర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని క‌థ‌నాలు :

 

ప్రభావవంతంగా కొనసాగిన “నారిశక్తి” కార్యక్రమం