భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, అక్టోబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

గుంటూరు జీజీహెచ్‌కు రూ.20 కోట్ల విరాళం

WhatsApp Image 2025-10-09 at 11.32.55 PM

భారత్ స‌మాచార్.నెట్, గుంటూరు జిల్లా : గుంటూరు వైద్య చరిత్రలో నిలిచిపోయే అపూర్వ దానమిది. అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్యురాలు, ఇమ్యునాలజిస్ట్‌ డాక్టర్‌ ఉమా గవిని తన జీవితాంతం కష్టపడి కూడబెట్టిన రూ.20 కోట్ల యావదాస్తినీ గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు (జీజీహెచ్) విరాళంగా ప్రకటించారు. 1965లో గుంటూరు వైద్య కళాశాలలో మెడిసిన్ పూర్తి చేసి, నాలుగు దశాబ్దాల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన డాక్టర్‌ ఉమ, భర్త మృతిచెందడం, వారసులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

చివరికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా మిగుల్చుకోకుండా, తన మొత్తం ఆస్తిని తృణప్రాయంగా దానం చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ విరాళాన్ని జీజీహెచ్‌లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనం అభివృద్ధి కోసం వినియోగించనున్నారు. తన జన్మభూమికి, తాను చదువుకున్న నగరానికి సేవ చేయాలనే సంకల్పంతో డాక్టర్‌ ఉమ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం ఆధునిక భారతంలో దాతృత్వానికి ఓ అద్భుత ఉదాహరణగా నిలిచింది.

మ‌రిన్ని క‌థ‌నాలు :

 

దొంగతనాలకు పాల్పడుతున్న దంపతులు అరెస్ట్