భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, అక్టోబర్ 2025, శనివారంభారత్ సమాచార్

కొడుకు చితికి నిప్పు పెట్టిన తల్లి

WhatsApp Image 2025-10-10 at 7.05.48 PM

భారత్ సమాచార్.నెట్, మంచిర్యాల: తాండూర్ మండలం మాదారం టౌన్‌షిప్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కొడుకులనే ఆధారంగా బతికిన రాజమ్మపై విధి పగబట్టింది. చాలా ఏళ్ల క్రితం భర్తను, ఏడాది క్రితం పెద్ద కొమారుడు సలాకుల రమేష్‌ను కోల్పోయిన ఆమెకు, చివరి ఆశ అయిన చిన్న కొడుకు సలాకుల నరేష్ గురువారం సాయంత్రం ఫిట్స్ వ్యాధితో మృతి చెందాడు.

ఉన్న ఒక్క కొడుకు కూడా మరణించడంతో ఆమె గుండె పగిలింది. శుక్రవారం నరేష్ దహన సంస్కారాలు నిర్వహించిన తల్లి రాజమ్మ.. కళ్ల నిండా కన్నీరు, గుండెనిండా దుఃఖంతో రోదిస్తూనే చిన్న కొడుకు చితికి తలకొరివి పెట్టి తుది వీడ్కోలు పలికింది. ఒక్కగానొక్క కొడుకు దూరం కావడంతో రోదిస్తున్న తల్లిని చూసి స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు