భారత్ సమాచార్.నెట్, మంచిర్యాల: తాండూర్ మండలం మాదారం టౌన్‌షిప్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కొడుకులనే ఆధారంగా బతికిన రాజమ్మపై విధి పగబట్టింది. చాలా ఏళ్ల క్రితం భర్తను, ఏడాది క్రితం పెద్ద కొమారుడు సలాకుల రమేష్‌ను కోల్పోయిన ఆమెకు, చివరి ఆశ అయిన చిన్న కొడుకు సలాకుల నరేష్ గురువారం సాయంత్రం ఫిట్స్ వ్యాధితో మృతి చెందాడు.

ఉన్న ఒక్క కొడుకు కూడా మరణించడంతో ఆమె గుండె పగిలింది. శుక్రవారం నరేష్ దహన సంస్కారాలు నిర్వహించిన తల్లి రాజమ్మ.. కళ్ల నిండా…