భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, అక్టోబర్ 2025, శనివారంభారత్ సమాచార్

ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి

8

భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండల అధ్యక్షులు ఏట మధుకర్ ఆత్మహత్య కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తాండూర్ మండల కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. వేమనపల్లి ఎస్సై ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. ఆత్మహత్యకు కారకులైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని, ఏట మధుకర్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న బిజెపి పార్టీపై కక్ష సాధింపు చర్యలో భాగంగా  అక్రమంగా కేసు బనాయించి ఆత్మహత్యకు కారణమయ్యారని, బెల్లంపల్లి ఎమ్మెల్యే వెంటనే స్పందించి వారిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఏట మధుకర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా చర్యలు చేపట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు దూడపాక భరత్ కుమార్,జిల్లా కార్యదర్శి రామగౌని మహీధర్ గౌడ్,జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు,బిజెపి సీనియర్ నాయకులు చిలువేరు శేషగిరి,పులగం తిరుపతి,తుకారం జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధం మల్లేష్,సీతాల్,ఎస్సీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పాగిడి చిరంజీవి,మండల ప్రధాన కార్యదర్శి పుట్ట కుమార్,మండల కార్యదర్శి గాదే రాజేశం,మండల ఉపాధ్యక్షులు కొండు రవి, మండల కోశాధికారి రాచర్ల సురేష్,సీనియర్ నాయకులు ఏముర్ల ప్రవీణ్,దుర్గ చరణ్,నాయకులు బీరేష్,ధర్మరాజుల రమేష్,కొమ్మ కొమురెల్లి, సంతోష్ సోషల్ మీడియా కన్వీనర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని కథనాలు: 

మంచిర్యాల జిల్లాలో స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు..