భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, అక్టోబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి

26

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: ప్రజల భద్రత, క్షేమం దృష్టిలో ఉంచుకొని రాబోయే దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల సూచించారు. బాణాసంచా విక్రయాల కోసం అనుమతి తప్పనిసరి. ఎలాంటి అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేసినా, సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా విక్రయాలు జరిపినా, ప్రేలుడు పదార్థాల చట్టం (Explosives Act) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీపావళి నేపథ్యంలో బాణాసంచా తయారీదారులు, సరఫరాదారులు, విక్రయదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిపే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.  “దుకాణాల మధ్య కనీస దూరం పాటించాలి. అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచాలి. విద్యుత్ లైన్ల దగ్గర బాణాసంచా నిల్వ చేయరాదు. మైనర్లు (చిన్నపిల్లలు) విక్రయంలో పాల్గొనరాదు”అని పాటించ వలసిన భద్రతా చర్యల గురించి తెలిపారు. ప్రజలందరూ చట్టాలు, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ కోరారు.

మరిన్ని కథనాలు: 

లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో జన సురక్ష సాచురేషన్