భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: ప్రజల భద్రత, క్షేమం దృష్టిలో ఉంచుకొని రాబోయే దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల సూచించారు. బాణాసంచా విక్రయాల కోసం అనుమతి తప్పనిసరి. ఎలాంటి అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేసినా, సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా విక్రయాలు జరిపినా, ప్రేలుడు పదార్థాల చట్టం (Explosives Act) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీపావళి నేపథ్యంలో బాణాసంచా తయారీదారులు, సరఫరాదారులు, విక్రయదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు…