భారత్ సమాచార్.నెట్, రాజన్న సిరిసిల్ల : దేశ రక్షణలో ప్రాణాలను అర్పించిన ధైర్యవంతులైన పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తూ.. వారి స్మారకార్థం ప్రతి సంవత్సరం ఈనెల 21న నిర్వహించే “పోలీస్ ఫ్లాగ్ డే” సందర్భంగా జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు విద్యార్థుల కోసం ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నారు. పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరించుకోవడంలో భాగంగా ఈ పోటీని ప్రకటించారు. 6వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) వరకు చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
విద్యార్థులు తమ వ్యాసాలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఏదైనా ఒక భాషలో రాసి, ఈనెల 28వ తేదీలోగా సమర్పించాలి. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి, రెండు, మూడు స్థానాల విజేతలకు బహుమతులు అందజేయబడతాయి. అంతేకాకుండా, విజేతల్లో అత్యుత్తమంగా నిలిచిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ విద్యార్థులకు సూచించారు.
మరిన్ని కథనాలు :
‘ఆర్టీఐ సామాన్యుడి వజ్రాయుధం’