భారత్ సమాచార్.నెట్, జయశంకర్ భూపాలపల్లి : జిల్లా నుంచి పలువురు నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ)లో చేరారు. పార్టీ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో, జిల్లా నాయకులు రవి పటేల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. వీరికి మల్లన్న కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లాలో క్లస్టర్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతి కోసం అధికార ప్రభుత్వంపై పోరాటాలు చేసి, ప్రజల పక్షాన గట్టిగా నిలబడాలని సూచించారు. అధికారంలో ఉన్న పార్టీల వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు. రవి పటేల్ జిల్లాలోని ప్రస్తుత రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలపై మల్లన్నతో సుదీర్ఘంగా చర్చించారు.
మరిన్ని కథనాలు :
ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం