భారత్ స‌మాచార్.నెట్, జయశంకర్ భూపాలపల్లి : జిల్లా నుంచి పలువురు నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ)లో చేరారు. పార్టీ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో, జిల్లా నాయకులు రవి పటేల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. వీరికి మల్లన్న కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లాలో క్లస్టర్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు.

ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతి కోసం అధికార ప్రభుత్వంపై పోరాటాలు చేసి, ప్రజల పక్షాన గట్టిగా నిలబడాలని…