భారత్ సమాచార్.నెట్, జగిత్యాల : ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమం ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో విజయవంతంగా జరిగింది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా పాల్గొని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 10 మంది అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బాధితుల సమస్యలను సావధానంగా విన్న ఎస్పీ, వాటిపై వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని, తద్వారా సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. గ్రీవెన్స్ డేలో వచ్చే ఫిర్యాదులను పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బాధితుల ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో పొందుపరుస్తూ, నిత్యం పర్యవేక్షణ చేస్తున్నామని, ప్రజల సమస్యల పరిష్కారానికి జగిత్యాల పోలీస్ శాఖ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని కథనాలు :
రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్ దుర్మరణం