భారత్ స‌మాచార్.నెట్, జగిత్యాల : ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమం ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో విజయవంతంగా జరిగింది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా పాల్గొని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 10 మంది అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బాధితుల సమస్యలను సావధానంగా విన్న ఎస్పీ, వాటిపై వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని, తద్వారా సత్వర న్యాయం జరిగేలా…