భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, అక్టోబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

చలో హైదరాబాద్ వెళ్తున్న వివోఏ లను ముందస్తు అరెస్టు

22

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు వివోఏలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వివోఎ ల సంఘం అధ్యక్షులు అశోక్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చలో హైదరాబాద్ వెళుతున్న వివోఏ లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులను వివోఏలు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 58 జీవో రద్దు చేయాలని, రీడింగ్ విధానం రద్దు చేయాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివోఏల సంఘం అధ్యక్షులు అశోక్, కార్యదర్శి ధనలక్ష్మి, కోశాధికారి సృజన, వివో ఏలు మహేష్, శిరీష, ప్రియాంక పాల్గొన్నారు.

మరిన్ని కథనాలు: 

కలెక్టర్ లకు మంత్రి తుమ్మల దిశానిర్దేశం