భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, అక్టోబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలి..

WhatsApp Image 2025-10-16 at 8.03.02 PM

భార‌త్ స‌మాచార్.నెట్, నిర్మల్ : జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సంబంధిత అధికారులను, ఎంపీడీవోలను ఆదేశించారు. నిర్మాణంలో జాప్యాన్ని సహించేది లేదని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. నిర్మాణ అనుమతులు పొందిన ఇండ్లను దశలవారీగా పూర్తి చేయాలని, మార్క్ అవుట్, బేస్‌మెంట్ దశల్లో ఉన్న వివరాలను వెంటనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.

మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, హౌసింగ్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేసి, పనులను వేగవంతం చేయాలని సూచించారు. తుది దశలో ఉన్న ఇండ్ల పూర్తికి ఆర్థిక ఇబ్బందులుంటే మహిళా సంఘాల ద్వారా రుణ సదుపాయాలు కల్పించేలా చూడాలని తెలిపారు. అలాగే, ఈజీఎస్ నిధుల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాలను కూడా తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు :

 

ఊపందుకున్న మద్యం దుకాణాల దరఖాస్తులు