భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, అక్టోబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలెక్టర్ సమీక్ష

WhatsApp Image 2025-10-16 at 8.05.01 PM

భార‌త్ స‌మాచార్.నెట్, నిర్మల్ : నిర్మల్ పట్టణంలో భవిష్యత్తులో భారీ వర్షాల వల్ల వరద నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ గురువారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాకాలానికి ముందే నాళాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించినట్లు తెలిపారు. ఇకముందు వర్షపు నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ మరమ్మతులు చేపడతామని అన్నారు. వరద నియంత్రణకు అవసరమైతే నూతన నిర్మాణాలు చేపట్టడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వరద నీటి నిల్వతో ప్రజలు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని క‌థ‌నాలు :

 

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలి..