భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, అక్టోబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

మీడియాపై దాడులు సమాజానికి గొడ్డలి పెట్టు

9

భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: మీడియాపై దాడులు చేయడం, జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం సమాజానికి గొడ్డలి పెట్టు లాంటిదని టీయూడబ్ల్యూజే 143 వనపర్తి జిల్లా అధ్యక్షుడు బక్షి శ్రీధర్ రావ్అన్నారు. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన కేసులను నిరసిస్తూ జిల్లా సాక్షి పత్రిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు జర్నలిస్టు సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వీరికి పలువురు ప్రజా కుల సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బక్షి శ్రీధర్ రావు మాట్లాడుతూ… ప్రభుత్వాలు పరిపాలన విషయంలో గాడి తప్పుతున్న సందర్భాలను గుర్తించి వార్తా కథనాలతో ప్రజలకు వివరించి ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. సమాజంలో నాలుగు స్తంభాలలో ఒకటిగా ఉన్న మీడియాపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టడం ప్రజల హక్కులను హరించడమే అవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇకనైనా మేల్కొని సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, ప్రజలకు సుపరిపాలన అందిస్తూ, సమాజ హితం కోసం పనిచేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జర్నలిస్టు లోకమంతా ఏకమై రెండు తెలుగు రాష్ట్రాలలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోలముని రమేష్ , జానీ, శ్రీనివాసరావు, సుంకరి రమేష్ యాదవ్ , భాను ప్రకాష్, గోర్ల రాజు, అశోక్ రెడ్డి, దినేష్, గోవర్ధన్, ఈశ్వర్ సాగర్, శ్రీను, చిన్న రాజు , జర్నలిస్టు సంఘాల నేతలు పాల్గొన్నారు.

మరిన్ని కథనాలు: 

ఏబీవీపీ ఆధ్వర్యంలో వనపర్తి కలెక్టరేట్ ముట్టడి.. ఉద్రిక్తత