భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పిలుపు మేరకు నవంబర్ 15వ తేదీ వరకు జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్యం-డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాలలో భాగంగా మణుగూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సురక్షా బస్టాండ్లో, ఆర్టీసీ బస్సులు,పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను ఫింగర్ ప్రింట్స్ స్కానర్ ద్వారా తనిఖీ చేశారు.ప్రభుత్వ నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాల బారిన పడకుండా అక్రమ రవాణాను అడ్డుకోవడంలో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందని మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులు చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు.గంజాయి అక్రమ రవాణా చేసే వారి సమాచారం అందించి భాద్యత గల పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని అన్నారు.మత్తుకు బానిసలై యువత తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు.ఎవరైనా నిషేదిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ గానీ,విక్రయిస్తూ గానీ పట్టుబడితే అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని,అవసరమైతే ఉన్నతాధికారుల అదేశాలతో పీడి యాక్టులను కూడా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ తనిఖీలలో ఏడూల్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు,ఎస్సై నగేష్, సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు:
భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ నిర్వహణ: భద్రాద్రి జిల్లా పోలీస్