భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పిలుపు మేరకు నవంబర్ 15వ తేదీ వరకు జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్యం-డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాలలో భాగంగా మణుగూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సురక్షా బస్టాండ్లో, ఆర్టీసీ బస్సులు,పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను ఫింగర్ ప్రింట్స్ స్కానర్ ద్వారా తనిఖీ చేశారు.ప్రభుత్వ నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాల బారిన పడకుండా అక్రమ రవాణాను అడ్డుకోవడంలో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందని…