భారత్ సమాచార్.నెట్, అన్నమయ్య : రాయచోటి పట్టణంలో బుధవారం ఉదయం మాసాపేట బ్రిడ్జి వద్ద పెను ప్రమాదం తప్పింది. కడప-రాయచోటి సర్వీస్‌కు చెందిన ఆర్టీసీ అద్దె బస్సుకు అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. బస్సు పక్కనే ఉన్న జ్యోతి రావు పూలే విగ్రహాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ బాబ్జి, వెనుకవైపు కూర్చున్న మరో ముగ్గురు ప్రయాణికులు స్వల్ప గాయాలపాలయ్యారు.
సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రులను 108 వాహనం ద్వారా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రేకులు ఫెయిల్ కావడానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విగ్రహానికి స్వల్ప నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.
మరిన్ని కథనాలు :
విజయనగరంలో గుమ్మం ముందు మనిషి పుర్రె… పూజలు