భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, అక్టోబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

వైద్యం కోసం వస్తే వాహనం మాయం

04

భార‌త్ స‌మాచార్.నెట్, గుంటూరు జిల్లా : ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న పేషెంట్‌ కుటుంబానికి అనుకోని షాక్ తగిలింది. భార్యకు చికిత్స చేయించుకోవడానికి వచ్చి పది రోజులుగా ఏఐఐఎంఎస్‌ (AIIMS)లో ఉన్న వ్యక్తి ద్విచక్ర వాహనం పార్కింగ్ నుంచే చోరీకి గురైంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఏఐఐఎంఎస్ హాస్పిటల్ వద్ద జరిగింది. పెనుగంచిప్రోలు మండలానికి చెందిన మొండితోక గోపి, తన భార్య వైద్యం కోసం పది రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి పార్కింగ్‌లో ఉంచిన తన AP39 AB 6794 నెంబర్ గల ద్విచక్ర వాహనం కనిపించలేదు.

వెంటనే అప్రమత్తమైన గోపి, చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో, వాహనం అపహరణకు గురైనట్లు గుర్తించారు. ఆయన వెంటనే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. ఈ ఆసుపత్రి ప్రాంగణం నుంచి గతంలో కూడా చాలా ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయని సమాచారం. నిరుపేద కుటుంబానికి చెందిన గోపి, చికిత్స ఖర్చుల పక్కన పెడితే వాహనం పోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

మ‌రిన్ని క‌థ‌నాలు :

రూ.1.75 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత