భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, అక్టోబర్ 2025, శనివారంభారత్ సమాచార్

కనిగిరిలో దోమల నివారణకు మున్సిపల్ ఛైర్మన్ పిలుపు

02

భార‌త్ స‌మాచార్.నెట్, ప్రకాశం జిల్లా : వర్షాకాలంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ శుక్రవారం పట్టణంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ను ప్రారంభించారు. 8వ వార్డులో మున్సిపల్ కార్మికులతో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ గఫార్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతతోనే డెంగీ, మలేరియా వంటి అంటువ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఉద్ఘాటించారు. పట్టణ ప్రజలు తమ ఇళ్ల వద్ద, పరిసర ప్రాంతాలలో తప్పనిసరిగా శుభ్రత పాటించాలన్నారు. ముఖ్యంగా, దోమలు వృద్ధి చెందేందుకు కారణమయ్యే ఖాళీ టైర్లు, పాత కూలర్లు, కొబ్బరి బొండాల చిప్పలను వెంటనే తొలగించాలని ఆయన కోరారు.

 

కాలువల్లో చెత్తాచెదారం వేయడం వలన నీరు నిలిచిపోయి, దుర్వాసనతో పాటు దోమలు ఉత్పత్తి అవుతాయని, తద్వారా తీవ్ర జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాబట్టి, పట్టణ ప్రజలు కనిగిరి అభివృద్ధికి సహకరించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చైర్మన్ అబ్దుల్ గఫార్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ నాయబ్ రసూల్, ఏఈ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు :

ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలి: మున్సిపల్ చైర్మన్