భార‌త్ స‌మాచార్.నెట్, ప్రకాశం జిల్లా : వర్షాకాలంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ శుక్రవారం పట్టణంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ను ప్రారంభించారు. 8వ వార్డులో మున్సిపల్ కార్మికులతో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ గఫార్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతతోనే డెంగీ, మలేరియా వంటి అంటువ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఉద్ఘాటించారు. పట్టణ ప్రజలు తమ ఇళ్ల వద్ద, పరిసర ప్రాంతాలలో తప్పనిసరిగా శుభ్రత పాటించాలన్నారు. ముఖ్యంగా, దోమలు వృద్ధి చెందేందుకు కారణమయ్యే ఖాళీ టైర్లు,…