భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, అక్టోబర్ 2025, శనివారంభారత్ సమాచార్

65 ఏళ్ల వయసులో జాతీయస్థాయిలో పతకాలు

04

భార‌త్ స‌మాచార్.నెట్, కృష్ణా జిల్లా : పెడన పట్టణానికి చెందిన వరదా భీమేశ్వరరావు 65 ఏళ్ల వయసులో సాధించిన ఘన విజయం రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. ఇటీవల బెంగళూరులో కర్ణాటక పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భీమేశ్వరరావు ఏకంగా మూడు గోల్డ్ మెడల్స్‌, ఒక సిల్వర్ మెడల్‌ను గెలుచుకున్నారు. ఈ అద్భుత విజయం సాధించి పట్టణానికి విచ్చేసిన భీమేశ్వరరావును పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శుక్రవారం ప్రత్యేకంగా అభినందించి, సత్కరించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ వయసులో జాతీయ స్థాయిలో స్వర్ణ, రజత పతకాలు సాధించడం యువతకు స్ఫూర్తిదాయకమని, ఇది పెడన పట్టణానికి గొప్ప గౌరవమని కొనియాడారు. భీమేశ్వరరావు పట్టుదల, క్రీడాస్ఫూర్తిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య, కమ్మగంటి వెంకటేశ్వరరావు సహా పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు :

మహిళలకు ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్షలు