భారత్ సమాచార్.నెట్, కృష్ణా జిల్లా : పెడన పట్టణానికి చెందిన వరదా భీమేశ్వరరావు 65 ఏళ్ల వయసులో సాధించిన ఘన విజయం రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. ఇటీవల బెంగళూరులో కర్ణాటక పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో భీమేశ్వరరావు ఏకంగా మూడు గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్‌ను గెలుచుకున్నారు. ఈ అద్భుత విజయం సాధించి పట్టణానికి విచ్చేసిన భీమేశ్వరరావును పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శుక్రవారం ప్రత్యేకంగా అభినందించి, సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ వయసులో…





