భారత్ సమాచార్.నెట్, ప్రకాశం జిల్లా : తర్లుపాడు మండల కేంద్రం నుంచి మార్కాపురం వెళ్లే ప్రధాన రహదారి భద్రతపై స్థానికులు వ్యక్తం చేసిన ఆందోళనకు అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు. సీతనాగులవరం బ్రిడ్జి వద్ద రోడ్డుకు ఇరువైపులా విస్తరించిన చెట్ల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కథనాలు వెలువడ్డాయి. దీనిపై తర్లుపాడు ఎంపీడీఓ అన్నమ్మ, ఏవో బుర్రి చంద్రశేఖర్, పంచాయితీ కార్యదర్శి సుభాకర్ తక్షణమే స్పందించారు.
ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించే ఉద్దేశంతో, అధికారులు తమ సిబ్బందిని పంపి వెంటనే రోడ్డుకు అడ్డుగా ఉన్న, ప్రమాదకరంగా మారిన చెట్లను పూర్తిగా తొలగించారు. ఈ తక్షణ చర్యల కారణంగా రహదారిపై రాకపోకలు సులభతరం కావడంతో పాటు, వాహన చోదకులు, ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా భద్రత పెరిగింది. అధికారుల చొరవను వాహనదారులు, స్థానిక ప్రజలు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని కథనాలు :
కనిగిరిలో దోమల నివారణకు మున్సిపల్ ఛైర్మన్ పిలుపు