భారత్ సమాచార్.నెట్, ప్రకాశం జిల్లా : తర్లుపాడు మండల కేంద్రం నుంచి మార్కాపురం వెళ్లే ప్రధాన రహదారి భద్రతపై స్థానికులు వ్యక్తం చేసిన ఆందోళనకు అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు. సీతనాగులవరం బ్రిడ్జి వద్ద రోడ్డుకు ఇరువైపులా విస్తరించిన చెట్ల కారణంగా ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కథనాలు వెలువడ్డాయి. దీనిపై తర్లుపాడు ఎంపీడీఓ అన్నమ్మ, ఏవో బుర్రి చంద్రశేఖర్, పంచాయితీ కార్యదర్శి సుభాకర్ తక్షణమే స్పందించారు.
ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించే ఉద్దేశంతో, అధికారులు తమ సిబ్బందిని…





