భారత్ సమాచార్.నెట్, పశ్చిమ గోదావరి జిల్లా : ఆంధ్రప్రదేశ్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీని నెలకొల్పాలనే లక్ష్యంతో పాలకొల్లులో శుక్రవారం జాతీయ తెలుగు సారస్వత పరిషత్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య, ప్రముఖులతో కలిసి జాతీయ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించడానికి చర్చలు జరిపారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు ‘అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’గా నామకరణం చేయాలని ప్రతిపాదించారు. గోదావరి జిల్లాలైన పాలకొల్లు, రాజమండ్రి ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ చిత్ర పరిశ్రమను నెలకొల్పాలని సమావేశంలో నిర్ణయించారు.
జోగయ్య మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి చిత్ర పరిశ్రమ ఏపీకి రావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. జనవరి నెలలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించడానికి పనులు వేగవంతం చేస్తున్నామని, ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీనటులను ఆహ్వానిస్తామని తెలిపారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు ప్రముఖ సినీ దర్శకుడు రాజా వన్నెం రెడ్డి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తారని ఆయన ప్రకటించారు.
మరిన్ని కథనాలు :
శివ నామ స్మరణతో మార్మోగుతున్న గోదావరి తీరాలు