భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, అక్టోబర్ 2025, శనివారంభారత్ సమాచార్

ఐతం విద్యార్థుల ప్రతిభకు పట్టం: ఇన్ఫోసిస్‌లో ఏకంగా 117 ఉద్యోగాలు

WhatsApp Image 2025-10-25 at 9.03.49 AM

భార‌త్ స‌మాచార్.నెట్, శ్రీకాకుళం జిల్లా: టెక్కలి సమీపంలోని ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (ఐతం) విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. దేశంలోనే అగ్రగామి ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్ లిమిటెడ్ నిర్వహించిన 2026 బ్యాచ్ క్యాంపస్ నియామకాల్లో వివిధ విభాగాలకు చెందిన 117 మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను దక్కించుకున్నారు. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ. 3.6 లక్షల ప్రారంభ వేతనం లభించనుంది.

డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జాతీయ స్థాయి సంస్థలో ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎంపిక కావడం ఐతం అందిస్తున్న నాణ్యమైన విద్యా ప్రమాణాలు, ప్రత్యేక శిక్షణా విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థుల కృషి, అధ్యాపకుల అంకితభావం ఈ విజయాన్ని అందించాయని తెలిపారు. ప్లేస్‌మెంట్ డీన్ డా. ఎం. సంతోష్‌కుమార్, ట్రైనింగ్ హెడ్ డా. వి.వి.వి.ఎస్.ఎస్.పి.ఎస్. శ్రీకాంత్ పర్యవేక్షణలో నిర్వహించిన కోడింగ్ వర్క్‌షాప్‌లు, ఇంటర్వ్యూ సెషన్లు ఈ అద్భుత ఫలితానికి దోహదపడ్డాయి.

 

మ‌రిన్ని క‌థ‌నాలు :

వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ