భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, అక్టోబర్ 2025, శనివారంభారత్ సమాచార్

Extramarital affairs: వివాహేతర సంబంధాల్లో ఆ నగరమే ఫస్ట్

illegalaffairswithothers650

భారత్ సమాచార్, హైదరాబాద్: వివాహేతర సంబంధాలతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడి భార్య భర్తను చంపిన ఘటనలు కొన్ని అయితే, ప్రియురాలి మోజులో పడి భర్త భార్యను చంపిన సంఘటనలు మరికొన్ని. చిన్న చిన్న మనస్పర్థాలతో వివాహేతర సంబంధంతో కట్టుకున్న వారిని కడతేర్చేందుకు వెనుకాడడం లేదు. నిత్యం దేశంలో ఎక్కడో ఒక చోట వివాహేతర సంబంధంతో ప్రాణాలు కోల్పుతున్న ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. గ్లీడెన్ సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం వివాహేతర సంబంధాల విషయంలో బెంగళూరు నగరం మొదటి స్థానం ఉంది. రెండో స్థానంలో ముంబాయి, మూడో స్థానంలో కోల్ కత్తా, నాల్గో స్థానంలో ఢిల్లీ, ఐదో స్థానంలో పుణే నిలిచాయి. ఐటీ, వైద్య రంగంలో ఉన్న వారిలోనే ఇతరుల కన్నా ఎక్కువ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారని గ్లీడెన్ సంస్థ నివేదికలో తేలింది. ఉరుకుల పరుగుల జీవితంలో వృత్తి రీత్యా బిజీగా ఉండడం, కుటుంబానికి సరైన సమయం కేటాయించకపోవడంతో భార్య లేదా భర్త పక్క దారులు పడుతున్నారని గ్లీడెన్ సంస్థ గుర్తించింది.

 

మరిన్ని కథనాలు:

ఓరి రాములా ఎంత పని చేసింది..?