భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, అక్టోబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

కానూరులో ఘనంగా నాగుల చవితి వేడుకలు

WhatsApp Image 2025-10-25 at 8.40.43 PM

భారత్ సమాచార్.నెట్, కృష్ణా: మచిలీపట్నం రూరల్ మండలం కానూరు గ్రామంలో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా పూజా కార్యక్రమాలు, అన్నదానం నిర్వహించారు. జిల్లా రైతు అధ్యక్షుడు, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గోపు సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

నాగుల చవితి సందర్భంగా ఆయన ముందుగా పుట్ట వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పర్వదినాన ఆ పరమేశ్వరుడు, నాగేంద్రుడు దయతో అందరికీ శక్తి, శ్రేయస్సు అనుగ్రహించాలని కోరుకున్నారు. ప్రజలు, రైతులందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిటికినేటి అయ్యప్ప, బొలిశెట్టి నాని, గోపు వెంకటరమణ, గోపు నాగ మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

65 ఏళ్ల వయసులో జాతీయస్థాయిలో పతకాలు