భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, అక్టోబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

మొంథా తుఫాన్… కలెక్టర్లతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష

843b6236-0ea9-46cf-bf1f-5ef6e48e6818

భారత్ సమాచార్, శ్రీకాకుళం జిల్లా: మొంథా తుఫాన్ నేపథ్యంలో కోనసీమ, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్ర‌భావాన్ని ఎదుర్కోనేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ముంద‌స్తుగా అన్ని చ‌ర్య‌లు తీసుకుందని, తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారాలు నియమించినట్లు మంత్రి స్పష్టం చేశారు. అన్ని జిల్లాలో క‌ట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ప్రజలు సహాయాన్ని పొందవచ్చు అని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు జిల్లాల కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి తుఫాన్ ప్ర‌భావం తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, పరివాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలన్నారు. ప్రధానంగా వైద్య ఆరోగ్యశాఖ, గ్రామీణ నీటి పరఫరా భాగం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు ప్రజలు చెట్ల క్రింద నిలబడొద్దని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు.