భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) బోధన్ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో నూతన నగర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా అడ్లురి శ్రీరామ్, ముఖ్య అతిథిగా జిల్లా ప్రముఖ్ తలాండే ఈశ్వర్ కుమార్, సీనియర్ కార్యకర్తలు సూర్యకుమార్, లక్ష్మణ్ చౌహన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నగర అధ్యక్షుడిగా పెద్దపల్లి శ్రీనివాస్ (గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, బోధన్), నగర వ్యవస్థ ప్రధాన ప్రముఖ్‌గా అడ్లురి శ్రీరామ్ (గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, నవీపేట్) బాధ్యతలు స్వీకరించారు. నగర ప్రముఖ్‌గా అరవింద్, ఉపాధ్యక్షులుగా నాగరాజు, వైభవ్, కార్యదర్శిగా అర్జున్ చౌహన్, సంయుక్త కార్యదర్శులుగా సాయి, వివేక్, అభినవ్ రెడ్డి నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా గంగ ప్రసాద్, వైభవ్, జోనల్ ఇంచార్జిలుగా కార్తీక్, విద్యాధర, రఘురాం ఎంపికయ్యారు.
మరిన్ని కథనాలు:
బీసీ రిజర్వేషన్లకు మాస్ లైన్ పూర్తి మద్దతు